Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించిన చాగంటి కోటేశ్వరరావు
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రశంసల జల్లు కురిపించారు.
కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరై, రోజంతా తమతో గడపాలని కోరగా లోకేశ్ వెంటనే అంగీకరించారని తెలిపారు.పిల్లలు దేశభక్తిని అలవర్చుకోవాలనే తాపత్రయం ఉన్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని ఆయన కొనియాడారు.
తాను కేవలం పొగడాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం లేదని, ఎక్కడ సంస్కారం, సంస్కృతి కనిపించినా వాటిని తప్పకుండా ఆవిష్కరించి తీరుతానని చాగంటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.



